- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తప్పు ఒకరిది.. శిక్ష మరొకరికి
దిశ, చిట్యాల : వ్యవసాయ భూముల్లో కెనాల్ కాలువ లేకున్నా వాటి కింద రైతుల భూములను అధికారులు తొలగించారు. ఈ తప్పిదం వారికి శాపంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, రేగొండ మండలాల్లోని వేలాది మంది రైతుల భూములు ఎస్సారెస్పీ కెనాల్ కాలువ కింద తొలగించబడ్డాయి. ఈ క్రమంలోనే తమ భూమి పట్టా నుంచి కొంత భూమిని తొలంగించారంటూ బాధిత రైతులు తహసీల్దార్ కార్యాలయం, అధికారుల చుట్టూ ప్రతీరోజు ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ వారు మాత్రం పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా కెనాల్ భూములను సరి చేయడానికి ధరణిలో ఎలాంటి ఆప్షన్లు లేవని సమాధానమిస్తూ దాటవేయడం గమనార్హం. దీంతో భూమిని కోల్పోయిన రైతులు తిరిగి రికార్డులలోకి ఎలా నమోదు చేసుకోవాలో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలకు వీరు దూరం అవుతున్నారు. కాస్తులో భూమిని సాగు చేసుకుంటున్నా సంక్షేమ పథకాలు అందకపోవడంతో లబోదిబోమంటున్నారు. కేవలం అధికారుల తప్పిదం మూలంగానే తమ భూములు రికార్డుల నుంచి తొలగించబడ్డాయని వాపోతున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
ధరణిలో ఎలాంటి అప్షన్లు లేవు..
ఎస్ఆర్ఎస్పీ కాలువ కింద భూములు కోల్పోయిన రైతులు ప్రతీరోజు ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అర్జీలు పెట్టుకుంటున్నారు. అయినా, వారి సమస్య పరిష్కారం కావడం లేదు. ధరణిలో ఇలాంటి భూములకు సంబంధించి ఆప్షన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాలేదని చెబుతూ రైతులను వెనక్కి పంపడం పరిపాటిగా మారింది. దీంతో కొందరు రైతులు ఇటీవల చిట్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తే మా పరిధిలో లేదని స్థానిక తహసీల్దార్ దాటవేశారు.
కెనాల్ లేకున్నా భూమి కట్
వ్యవసాయ భూముల ఆనుకుని సుమారు వంద కిలోమీటర్ల దూరంలో సైతం ఎలాంటి ఎస్ఆర్ఎస్పీ కాలువ లేకున్నా భూములు తొలగించబడ్డాయి. కొన్నాళ్లు మళ్లీ రికార్డుల్లోకి భూమి నమోదు చేస్తారనే నమ్మకంతో రైతులు పట్టించుకోలేదు. నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో తహసీల్దార్ కార్యాలయంలో వీరంతా అర్జీలు పెట్టుకుంటున్నారు. అధికారులు మాత్రం తొలగించబడ్డ భూములను రికార్డుల్లోకి తిరిగి నమోదు చేయడానికి ఎలాంటి అనుమతులు లేవని దాట వేస్తున్నారు.
అన్యాయంగా భూమిని తొలగించారు..
నాకు కైలాపూర్ గ్రామ శివారు 43 సర్వే నంబర్‌లో 2.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 6 నెలల కిందట 9 గుంటల భూమిని అధికారులు ఎస్సారెస్పీ కాలువ కింద తొలగించారు. మా భూమి చుట్టూ ఎక్కడ కాలువ లేదు. అధికారులు భూమిని రికార్డుల నుంచి తొలగించడం అన్యాయం. ఇటీవలే తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కూడా చేశాం. అయినా, ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు. జిల్లా కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయాలి.