- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కల్లానికి కిరాయి… బస్తాకు రూ.2…
దిశ, నిజామాబాద్: రైతులు ఎవరి పొలంలో వారు కల్లాలను తయారు చేసుకుని పంట నూర్పిడి చేసుకుంటారు. ఆ కల్లాల్లో ధాన్యాన్ని ఆరబెట్టుకుంటారు. లేదా సొసైటీలు ఏర్పాటు చేసిన ఫ్లాట్ పారాలపై లేదా రోడ్లపై ఆరబెట్టుకుంటారు. అయితే రైతులు ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేస్తారో అక్కడనే సొసైటీలు లేదా వ్యాపారులు ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంటారు. కానీ, నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ ముంపు గ్రామమైన గంగా గడ్డ నడ్కుడ(జీజీ నడ్కుడ)లో మాత్రం పరిస్థితి వేరు. అక్కడ రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు లేదా నిలువ చేసుకోవడానికి డబ్బులు చెల్లిస్తున్నారు. ఆ గ్రామంలోని కొందరు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమీలో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం, నిల్వ చేస్తుంటారు. ఎందుకంటే ఆ గ్రామం ప్రాజెక్ట్ చివరన ఉన్నందున సరైనా రోడ్డు, ఇతరర వసతులు, సౌకర్యాలు లేవు. దీంతో నందిపేట్ మండలం డోంకేశ్వర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలోని గంగా గడ్డనడ్కుడ గ్రామంలోనే ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం లేదా నిల్వ చేస్తుంటారు. ఇందుకుగాను రైతులు బస్తాకు రూ.2 చెల్లించాల్సిందే. ఈ తంతు ప్రతి ఏడాది రెండు పంటలకు కొనసాగుతూ వస్తుంది.
గ్రామంలో 400 పైచిలుకు రైతులు రెండు పంటల కాలంలో 700 పైచిలుకు ఎకరాల్లో వరిని సాగు చేస్తుంటారు. ధాన్యాన్ని ఆరబెట్టుకునే టార్పాలిన్ లకు అద్దె చెల్లిస్తామని, ధాన్యం బస్తాకు రూ.2 చొప్పున చెల్లించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. రైతుల వ్యవసాయ క్షేత్రంలో ధాన్యాన్ని తూకం చేయాల్సిన సొసైటీ ఒక్కదగ్గరకే ధాన్యం తీసుకువచ్చి నిలువ చేయాలని చెప్పడంతో గ్రామ రైతులందరూ ప్రైవేట్ వ్యక్తులకు చెందిన వ్యవసాయ క్షేత్రంలోనే ధాన్యాన్ని ఆరబెట్టి అక్కడే నిలువ చేసి అమ్మకాలు చేస్తున్నారు. రైతులకు ఇది ఒకరకమైన భారమే. సంబంధిత పొలం యజమానులు ప్రతి పంటకు సుమారు రూ. లక్ష వరకు ఆదాయాన్ని కల్లానికి కిరాయి రూపంలోనే పొందతున్నారు.
లాక్ డౌన్ ఎఫెక్ట్..
లాక్ డౌన్ కారణంగా హమాలీలు దొరక్క గ్రామంలో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించి వారం రోజులు గడిచినా ఒక్క బస్తా ధాన్యాన్ని కూడా తూకం వేయలేదని గ్రామ రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం అంతసిద్ధంగా ఉండగా కొనుగోళ్లు కాక ఎప్పుడు చెడగొట్టు వానలు పడుతాయోనని ఆందోళన చెందుతున్నారు. ధాన్యం ఆరబెట్టడానికి అయ్యే ఖర్చు టార్పాలిన్( ప్లాస్టిక్ సంచుల) గట్టలకు అధికంగా రోజుకు రూ.15 చెల్లించాల్సి వస్తోందని, ఇది అధిక వ్యయమే అని రైతులు అంటున్నారు. అదేవిధంగా ఉన్న కొంతమంది హామాలీలు వారికి సంబంధించిన డబ్బులను చెల్లిస్తేనే ధాన్యాన్ని లారీలోకి లోడ్ చేస్తున్నారని వాపోతున్నారు. రైతులు ధాన్యాన్ని తూకం వేసే వరకు టార్పాలిన్లలకు సైతం ప్రతి రైతుకు రూ.1000 నుంచి 2 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈసారి హమాలీల చార్జీలు అధికంగా తమపైనే భారంపడుతుందని రైతులు వాపోతున్నారు.
tags: Grain, Purchase, Problems for Farmers, Nizamabad, Facilities, Hamalis, Hire