- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మా ధాన్యం కొనండి.. ఆర్డీవో కాళ్ల మీద పడ్డ రైతులు
by Shyam |
X
దిశ, వరంగల్: జనగామ మండలంలోని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఆర్డీవో కాళ్ల మీద పడ్డారు. ఈ ఘటన సోమవారం కలెక్టరేట్ ఎదుట చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రింబవళ్లు కష్టపడి పండించిన ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా, జనగామ మండలం అడవి కేశవపురం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో అధికారులు కొనడం లేదని బాధిత రైతులు కలెక్టరేట్ ఆవరణలో ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న ఆర్డీవో సంఘటన స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే పలువురు రైతులు తాము తీసుకొచ్చిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆర్డీవో కాళ్ల మీద పడి గోడును వెళ్లబోసుకున్నారు.
tags: rto, collectorate, farmers, fall on rt foot, neglect on rice purchase
Advertisement
Next Story