రైతులను కలవర పెడుతున్న గన్నీ సంచులు.. సమస్య తీరేదెలా..?

by Shyam |
రైతులను కలవర పెడుతున్న గన్నీ సంచులు.. సమస్య తీరేదెలా..?
X

దిశ, కొడంగల్: ఈ ఏడాది వరిసాగు అధికంగా చేయడంతో గన్నీ బస్తాల కొరత రైతులను కలవర పెడుతోంది. నకిలీ ఎరువులు, కూలీల కొరత, కరెంట్ కోతల మధ్య ఎట్టకేలకు పంటను సాగు చేసిన రైతన్న చివరకు అమ్ముకుందాం అంటే ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే వరి కొనుగోలును ప్రభుత్వమే చేస్తోందని గొప్పలు చెబుతున్నప్పటికీ.. కనీసం గన్నీ సంచులను సరిపడ ఉంచడం లేదంటూ రైతులు వాపోతున్నారు. దీంతో పండించిన పంటను ఎలా అమ్ముకోవాలో తెలియక సతమతమవుతున్నామంటున్నారు.

మరో‌వైపు కొనుగోలు చేసే సమయంలో లెక్కకు మించి కోతలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు చెల్లించే సమయంలో కొంత మంది అధికారులు కుమ్మక్కై.. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను పక్క దారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి గన్నీ బస్తాలను పంపిణీ చేయాలని కోరుతున్నారు. అలాగే కొనుగోలు కేంద్రాలను కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ విషయంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో అనేది వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story