50 రోజులవుతోంది సారూ.. ఇంకా ఆలస్యమేందీ?

by  |
50 రోజులవుతోంది సారూ.. ఇంకా ఆలస్యమేందీ?
X

దిశ, ఆదిలాబాద్: ‘సార్.. నేటికి 50 రోజులవుతోన్నది. ఇంకా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మీరు స్పందించే వరకూ మేం ఇక్కడి నుంచి కదిలేదిలేదు’ అంటూ వారంతా మొండికేసి అక్కడే కూర్చున్నారు. దీంతో ఆ ఉన్నతాధికారి దిగొచ్చి స్పష్టమైన హామీ ఇవ్వడంతో వారు సద్దుమనిగారు. శనివారం నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్ (జి) మండలం రాంపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. మక్కలు, వడ్లు కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కారు. కాంటాకు వేసి 50 రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చి.. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించే వరకూ తమ ఆందోళనను కొనసాగిస్తామంటూ రైతులు చెప్పడంతో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆ గ్రామానికి చేరుకుని వెంటనే కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళనను విరమించుకున్నారు.


Next Story

Most Viewed