- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పులతో బతుకు భారమై రైతు ఆత్మహత్య
దిశ, చిట్యాల : పంట పెట్టుబడి కోసం చేసిన అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఏలేటి రామయ్య పల్లిలో బుధవారం వెలుగుచూసింది. ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎల్లయ్య (62) తనకున్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమితో పాటు మరొక నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని మిర్చి, పత్తి పంటను సాగు చేస్తున్నాడు.
ఇటీవల కురిసిన వర్షాలకు కొంత భూమి జాలువారగ, పత్తి పంట తెగుళ్లతో నేల వాలింది. వీటి కోసం ఎక్కువ మొత్తంలో అప్పు చేసి పెట్టుబడి పెట్టగా తీవ్ర పంట నష్టం వాటిల్లడంతో మనస్థాపానికి గురై తన వ్యవసాయ భూమి దగ్గరే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఎల్లయ్యను తోటి రైతులు గమనించి చిట్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా డాక్టర్ మృతి చెందాడని తెలిపారు. ఎల్లయ్య భార్య రాధమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.