‘జాతిరత్నాలు’ హీరోయిన్‌కు అదిరిపోయే ఆఫర్

by Jakkula Samataha |
‘జాతిరత్నాలు’ హీరోయిన్‌కు అదిరిపోయే ఆఫర్
X

దిశ, సినిమా : ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖల్లాసే’ అంటూ కుర్రకారు ఆ అందాన్ని తెగ పొగిడేస్తున్నారు. తన ఫొటోను మొబైల్ వాల్ పేపర్‌గా సెట్ చేసుకుని ఆరాధిస్తున్నారు. ఉంగరాల జుట్టు.. పెద్ద కళ్లు.. ఎప్పుడూ నవ్వుతో వెలిగిపోయే మోము.. ఆరడుగుల కటౌట్‌కు సెట్ అయ్యే అందం.. ఇదంతా వింటుంటే క్లియర్ ఐడియా వచ్చింది కదా! హా.. తనే టాలీవుడ్ ఇండస్ట్రీ చిట్టి ఫరియా అబ్దుల్లా. ‘జాతిరత్నాలు’ సినిమాలో చిట్టిగా కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ.. వరుస ఆఫర్లతో దూసుకుపోతోందని టాక్. ఇప్పటికే ‘జాతిరత్నాలు’ ట్రైలర్ రిలీజ్ టైమ్‌లో ప్రభాస్‌కు సరైన జోడీ అనిపించుకున్న ఈ పొడుగుకాళ్ల సుందరి.. తాజాగా మాస్ మహరాజ్ రవితేజతో రొమాన్స్ చేసే చాన్స్ కొట్టేసిందని సమాచారం. ప్రస్తుతం ‘ఖిలాడి’గా బిజీగా ఉన్న రవితేజ.. తర్వాత త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో ఈ లోకల్ బ్యూటిని జోడీగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story