- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో లెజెండరీ క్యారెక్టర్‌లో ఫర్హాన్
దిశ, వెబ్ డెస్క్: బయోపిక్‌లో నటించడమంటే..సవాల్‌తో కూడుకున్న పని. లెజెండరీ రోల్స్ ప్లే చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా.. విమర్శలు మూటకట్టుకోవాల్సి వస్తుంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ..తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ హీరో.. ఫర్హాన్ అక్తర్. ఇప్పటికే ఇండియన్ స్ప్రింటర్ మిల్కా సింగ్ పాత్రలో నటించి మెప్పించాడు. 2013లో విడుదలైన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మిల్కా సింగ్ ఆ సినిమా చూసి.. ఎంతో భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. పర్హాన్ మరో లెజండరీ పాత్రలో నటించేందుకు సిద్ధమయ్యాడు.
అంతరిక్ష ప్రయాణం చేసిన తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ అని అందరికీ తెలిసిందే. ఆయన జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతుంది. కెమెరామేన్ మహేశ్ మతై ఈ మూవీతో దర్శకుడిగా మారుతున్నారు. మొన్నటి వరకు ఈ పాత్రను చేసే అవకాశం ఎవరికీ వస్తుందా అని అందరూ ఎదురు చూశారు. ఈ జాబితాలో బాలీవుడ్ ఖాన్ త్రయంతో పాటు.. ఇటీవలే సూసైడ్ చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు కూడా వినిపించింది. అయితే, ఇందులో నటించేది ఫర్హాన్ అక్తర్ అని తేలిపోయింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఫర్హాన్ ప్రస్తుతం భాగ్ మిల్కా భాగ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రాతోనే ‘తుఫాన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇదో ఫిక్షనల్ బాక్సింగ్ బేస్డ్ సినిమా అని ఫిల్మ్ మేకర్స్ తెలిపారు. ఈ సినిమా కోసం.. ఫర్హాన్ పలువురు బాక్సర్లను కలిశాడు. వారి నుంచి ఎంతో నేర్చుకున్నానని పర్హాన్ తెలిపాడు. భాగ్ మిల్క్ భాగ్ కోసం.. తన బాడీని స్ప్రింటర్‌గా మేకోవర్ చేసుకున్న ఈ నటుడు.. ఇప్పుడు బాక్సర్‌గా కనిపించడానికి కూడా అంతే కష్టపడుతున్నాడు. మరి రాబోయే ప్రాజెక్ట్ రాకేష్ శర్మ సినిమా కోసం.. ఎలా ప్రిపేర్ అవుతాడో చూడాలి.