- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యుత్ శాఖలో అజయ్ మిశ్రా కృషి గొప్పది
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ సాధించిన అద్భుత విజయాల్లో ఇంధన శాఖ కార్యదర్శిగా పనిచేసిన అజయ్ మిశ్రా కృషి ఎంతో ఉందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు అన్నారు. ప్రభుత్వానికి, విద్యుత్ సంస్థలకు మధ్య సమన్వయం చేసుకుంటూ సమయస్ఫూర్తితో బాధ్యతలు నిర్వహించారని అభినందించారు. శుక్రవారం పదవీ విరమణ చేసిన అజయ్ మిశ్రాకు ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ సౌధలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రావు మాట్లాడారు. అజయ్ మిశ్రా ఇంధన శాఖ కార్యదర్శిగా మెరుగైన సేవలందించారని కొనియాడారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా మాట్లాడుతూ మూడు దశాబ్దాలకుపైగా సాగిన తన కెరీర్ లో 25శాఖలు నిర్వహించానని, వాటిలో విద్యుత్ శాఖను అతి ఎక్కువ కాలం పూర్తి సంతృప్తితో నిర్వహించానని అన్నారు. విద్యుత్ సంస్థల బాధ్యులంతా ఎంతో చిత్తశుద్ధితో పని చేశారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్ ఎండీ జి.రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ ఎండీ గోపాల్ రావు, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్‌రావు, డైరెక్టర్లు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.