- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్యాటీ మదర్‌కు ఇంత స్లిమ్ పిల్లలా.. ఫరాఖాన్‌పై ట్రోలింగ్స్
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ఫరాఖాన్.. తనపై వస్తున్న ట్రోల్స్‌కు అర్బాజ్ ఖాన్ చాట్ షోలో కౌంటర్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ బుధవారం రిలీజ్ కానుండగా.. తాజాగా టీజర్ రిలీజైంది. ఇందులో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు తమకు తామే క్రిటిక్స్‌గా భావిస్తూ.. సినిమాల గురించి మొత్తం తెలుసని ఫీల్ అవుతుంటారని విమర్శించింది. అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్‌తో తాను తీసిన ‘తీస్‌మార్ ఖాన్’ మూవీపై ఇప్పటికీ ట్రోల్స్ ఎదుర్కొంటున్నట్టు చెప్పిన ఫరా.. సినిమా వచ్చి పదేళ్లయిందని, అవన్నీ మరిచిపోయి ముందుకెళ్లాలని సూచించింది. ఇక తను ఎక్కడైనా ‘హలో’ అని విష్ చేస్తే.. ‘నమస్తే, సలామ్’ ఎందుకు చెప్పలేదని ట్రోలింగ్‌కు దిగుతున్నారని వివరించింది.
ఇవన్నీ పక్కనబెడితే తన పిల్లలు ‘దివా, అన్య, సిజర్’ విషయంలో నెగెటివ్ కామెంట్స్ ఎదుర్కొన్నానని.. ‘మదర్ ఫ్యాట్‌గా ఉంటే, పిల్లలెందుకు ఇంత సన్నగా ఉన్నారని’ గతంలో వచ్చిన కామెంట్‌కు ఘాటుగా స్పందించింది. ‘మీ పిల్లల సంగతి మీరు చూసుకోండి.. నా పిల్లల్ని నేను చూసుకుంటాను’ అని రిప్లయ్ ఇచ్చింది. ఇక బాలీవుడ్‌లో నెపోటిజంకు సంబంధించిన చర్చపై ఆడియన్స్‌నే ప్రశ్నించింది. ఇండస్ట్రీలో బంధుప్రీతిని పాయింట్ అవుట్ చేస్తున్నవారు కూడా షారుఖ్ ఖాన్ కూతురు, కరీనా కొడుకు ఫొటోలనే చూడాలనుకుంటారని బదులిచ్చింది.