- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మలయాళీ కుట్టి.. లుక్స్ ప్రెట్టీ
అనుపమ పరమేశ్వరన్… ఈ పేరు వినగానే కర్లీ హెయిర్, క్యూట్ స్మైల్ , అట్రాక్టివ్ ఐస్ మన కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. ఎక్స్ ప్రెషన్ క్వీన్ అనుపమ డ్యాన్స్, వాయిస్, యాక్టింగ్ అదుర్స్. దేవలోకం నుంచి వచ్చిన దేవకన్యే భువిపైన అనుపమలా తిరుగుతుందా అన్నంత అందం ఆమె సొంతం. తనను చూడగానే తొలి చూపులోనే మనసు పారేసుకున్న హృదయాలు ఎన్నో. ఆ చూపుకు బానిసై.. ఆ కురుల్లో కొట్టుకుపోయిన మనస్సులు మరెన్నో. అంతటి అందాల ముద్దుగుమ్మ జన్మించి ఈ రోజుకు 24 ఏళ్లు అయిన సందర్భంగా సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు.
మలయాళీ కుట్టి అనుపమ కాలేజ్ డేస్‌లో ఉండగానే సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. మాలీవుడ్ సూపర్ స్టార్ నివిన్ పౌలీ ప్రేమమ్ మూవీతో సినీరంగ ప్రవేశం చేసి మేరీ జార్జ్‌గా ఆకట్టుకుంది. ఆ కర్లీ హేయిర్‌కు కేరళ యువత ఫిదా అయిపోయిగా ప్రెట్టీ లుక్స్, స్వీట్ స్మైల్‌తో ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. ఇక అంతే, అక్కడి నుంచి వెనక్కి చూసుకోలేదు అనుపమ. తెలుగు, తమిళం, కన్నడ అన్ని భాషల్లోనూ నటించే ఛాన్స్ కొట్టేసింది. అంతే కాదు ఏ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది.
మలయాళంలో ప్రేమమ్, తెలుగులో అఆ, తమిళ్‌లో కోడి, కన్నడలో నటసార్వభౌమ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అన్నిట సక్సెస్ అందుకుంది. అంతేకాదు మ్యాగ్జిమమ్ తొలి సినిమా సూపర్ స్టార్స్‌తోనే చేసింది. 2015లో సినీ రంగ ప్రవేశం చేసిన అనుపమ కేవలం ఐదేళ్లలో దక్షిణాదిన అన్ని భాషలను కవర్ చేసేసింది. టాలీవుడ్‌లో అఆ, శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, తేజ్ ఐ లవ్ యూ, హలో గురు ప్రేమ కోసమే, కృష్ణార్జున యుద్ధం సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈ అందాల భామ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది.