సల్మాన్ కంటతడి.. ఆమెను వెనక్కు తీసుకురండి!

by Shamantha N |
సల్మాన్ కంటతడి.. ఆమెను వెనక్కు తీసుకురండి!
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగులో ఇటీవలే బిగ్ బాస్ సీజన్4 పూర్తి కాగా, హిందీలో సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘సీజన్ 14’ రసవత్తరంగా నడుస్తోంది. తాజాగా ఈ ‘షో’కు సంబంధించి కంటెస్టెంట్ జాస్మిన్ భాసిన్‌ను ఎలిమినేట్ చేయడంతో.. ఆమె అభిమానులంతా తనను వెనక్కి తీసుకురావాలంటూ ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. దీంతో ‘బ్రింగ్ జాస్మిన్ భాసిన్ బ్యాక్’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది.

ఇండియన్ యాక్ట్రెస్, మోడల్ అయిన జాస్మిన్ భాసిన్.. బిగ్ ‌బాస్‌ 14లో తన గేమ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఈ క్రమంలో.. ట్రోఫీ గెలుచుకునే సత్తా ఉన్న కంటెస్టెంట‌్లలో తను కూడా ఒకరిగా నిలుస్తుందని ఆమె ఫ్యాన్స్ ఆశించారు. అయితే అనుకోకుండా బీబీ రూల్స్ బ్రేక్స్ చేయడంతో.. జాస్మిన్, అలీ అగోని, అభినవ్ శుక్లా, రుబీనా దిలైక్ ఎలిమినేషన్‌లో నిలిచారు. అయితే ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు ఓటింగ్ శాతం కూడా మెరుగ్గానే ఉన్నప్పటికి, బీబీ14 నుంచి జాస్మిన్ ఎలిమినేట్ అవడం గమనార్హం. ఈ క్రమంలో ఆమె ఫ్యాన్స్‌తో పాటు హోస్ట్ సల్మాన్ ఖాన్ కూడా భావోద్వేగానికి గురి కాగా, ఆమెను తిరిగి బీబీ 14లోకి తీసుకు రావాలంటూ ‘బ్రింగ్ జాస్మిన్ భాసిన్ బ్యాక్’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ మేరకు ఇప్పటికే 1.25 మిలియన్ ట్వీట్లు వెల్లువెత్తుగా.. ఆదరణ లేని, అసలు ఏమాత్రం కూడా అర్హత లేని ఆటగాళ్లును కొనసాగిస్తూ, పోటీనిచ్చే కంటెస్టెంట్ జాస్మిన్‌ను ఎలిమినేట్ చేయడం దారుణమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జాస్మిన్ ఎలిమినేషన్ సందర్భంగా సల్మాన్ కూడా కంటతడి పెట్టాడంటే ఆమె బీబీ14లో ఉండే కంటెస్టెంట్ అని, ఇది బిగ్ ‌బాస్‌కు సిగ్గు చేటని విమర్శిస్తున్నారు.

ఇక జాస్మిన్.. బీబీ14కు రావడానికి కలర్స్ చానల్ రూల్స్ బ్రేక్ చేశానని, వారికి 2 కోట్ల ఫైన్ కట్టాలని చెప్పుకొచ్చింది. మరి ఫ్యాన్స్ చేస్తున్న ట్వీట్లతో ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్లీ హౌస్‌లోకి తీసుకుంటారా? లేదా అన్నది వేచి చూడాలి.

tags :

slug : photo : jasmin bhasin

Advertisement

Next Story