- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమంత.. నీకు దండం పెడతా.. దయచేసి మా అన్నను వదిలేయకు
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ ఎన్నో అడ్డంకులను దాటుకొని ఈ శుక్రవారం థియేటర్లో విడుదల అయినా విషయం తెలిసిందే. సున్నితమైన ప్రేమకథగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకొని హిట్ దిశగా సాగుతోంది. ఇక థియేటర్ల వద్ద ప్రేక్షకుల మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియాలో చై- సామ్ విడాకుల విషయం ఎంత వైరల్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ జంట విడాకులు తీసుకోవడం అభిమానులకు మింగుడుపడడం లేదు. ఎంతో ప్రేమగా ఉంటూ, భర్తకు ఎప్పుడు సపోర్ట్ చేసే సామ్ ఒక్కసారిగా చైతో విడిపోవడం, ఆయన సినిమా ప్రమోషన్లలో కనిపించకపోవడంతో అభిమానులు కొంత నిరాశపడుతున్నారు.
శుక్రవారం సినిమా చూసి బయటకొచ్చిన కొంతమంది అభిమానులు ఈ విషయాన్నీ కూడా తేటతెల్లం చేశారు. సినిమా బావుందని, నాగ చైతన్య యాక్టింగ్, సాయి పల్లవి డాన్స్ అదరగొట్టేశారని చెప్తూనే.. అక్కినేని ఫ్యామిలీలో వినపడుతున్న డైవోర్స్ విషయాన్ని బయటపెట్టారు. ఈ లవ్ స్టోరీ సినిమాను సమంత చూడాలని, ఆమె లేకుండా చైతూ ని ఉహించుకోలేమన్న అభిమానులు దయచేసి నాగచైతన్య – సమంత ఇద్దరూ విడిపోవద్దని, ఇద్దరు కలిసే ఉండాలని కన్నీరు పెట్టుకున్నారు. ఇక కొన్నిచోట్ల చైతు అభిమానులు అయితే సమంత.. నీకు దండం పెడతా.. దయచేసి మా అన్నను వదిలివెళ్లకు అంటూ కోరారు. మరి అభిమానుల కోరికమేరకైనా ఆ జంట విడిపోకుండా ఉంటే చాలని ఇండస్ట్రీ వర్గాలు ముచ్చటించుకొంటున్నాయి.
Hot actress Instagram updates
https://twitter.com/SandilyaDHFM/status/1441330970003525642?s=20