- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘బుజ్జిని హత్యచేసినోళ్లను ఎన్‌కౌంటర్ చేయాలి’
దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు మండలంలో మంత్రాలు వస్తాయన్న నెపంతో బుజ్జి అనే మహిళలను కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మెగావత్ నరసింహను ఎన్ కౌంటర్ చేయాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు సోమవారం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపి బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేవరకూ ఆందోళన విరమించేదిలేదంటూ భిష్మించుకుని కూర్చున్నారు. మృతురాలు బుజ్జిని మెగావత్ నరసింహ సుఫారి గ్యాంగ్‌తో కలిసి కిడ్నాప్ చేసి అతి దారుణంగా హత్యచేశారని ఆరోపించారు. ఈ ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో మండల కేంద్రంలో భారీగా పోలీసులను మోహరించారు. చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య ఆధ్వర్యంలోని పోలీసులు సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో విషయం తెలిపారు.
బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని, ఆందోళన విరమించాలని కోరినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. అంతేగాకుండా బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా ప్రభుత్వం నుంచి రూ.4లక్షు, తదనంతరం మరో రూ.4లక్షలు ఎక్స్ గ్రేషియా అందేలా చర్యలు తీసుకుంటామని స్థానిక తహసీల్దార్ బ్రహ్మయ్య హామీ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందిన కుటుంబ సభ్యులు ఆందోళన విరమించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని మరోసారి వేడుకున్నారు. ఈ హత్య కేసులో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మిగతా వారి కోసం గాలిస్తున్నారు.