జూన్ 1 నుంచి ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్

by Shamantha N |
జూన్ 1 నుంచి ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
X

దిశ, న్యూస్ బ్యూరో: దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాలకు జూన్ 1వ తేదీ నుంచి రైళ్లను నడపనున్నట్లుగా ప్రకటించిన రైల్వే శాఖ ఆయా సర్వీసుల వివరాలను వెల్లడించింది. ఇందులో ఏడు రైళ్లు నేరుగా తెలంగాణకు నడవనుండగా.. మరికొన్ని తెలంగాణ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లనున్నాయి. హౌరా-సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌తో పాటు దురంతో ఎక్స్‌ప్రెస్, దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు జూన్ 1 నుంచి నడవనున్నాయి. రెగ్యులర్‌గా నడిచే టైమింగ్ ప్రకారమే అవి నడుస్తాయని రైల్వే శాఖ తెలిపింది. జనశతాబ్ది, దురంతో లాంటి రైలు సర్వీసులు సాధారణ రోజుల్లో ఎయిర్ కండిషన్ కోచ్‌లతో నడుస్తున్నా.. ప్రస్తుత కరోనా నేపథ్యంలో నాన్ ఏసీ కోచ్‌లతో నడవనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

రాష్ట్రానికి నడిచే, రాష్ట్రం మీదుగా ప్రయాణించే రైళ్ల వివరాలు

హౌరా-సికింద్రాబాద్ : ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్

ముంబాయి-హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్

ఢిల్లీ-తెలంగాణ: తెలంగాణ ఎక్స్‌ప్రెస్

గుంటూరు-సికింద్రాబాద్: గోల్కొండ ఎక్స్‌ప్రెస్

తిరుపతి-నిజామాబాద్ : రాయలసీమ ఎక్స్‌ప్రెస్

హైదరాబాద్-విశాఖపట్నం: గోదావరి ఎక్స్‌ప్రెస్

విశాఖపట్నం-ఢిల్లీ: ఏపీ ఎక్స్‌ప్రెస్

ఢిల్లీ-యశ్వంతపూర్ : సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

సికింద్రాబాద్ – ఢిల్లీ : దురంతో ఎక్స్‌ప్రెస్

ధన్‌పూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్

ఢిల్లీ – తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్

Advertisement

Next Story