నకిలీ పత్తి విత్తనాల ముఠా అరెస్ట్

by Shyam |
నకిలీ పత్తి విత్తనాల ముఠా అరెస్ట్
X

దిశ, క్రైమ్‌బ్యూరో: హయత్‌నగర్ బ్రాహ్మణపల్లిలోని ఓ గోడౌన్‌లో నకిలీ పత్తి విత్తనాలను తయారు చేస్తున్న ముఠాను మంగళవారం సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు చింతల వెంకటేశ్వర్లు, పుట్టా వెంకట రమణ, నోముల వెంకన్న, వగలగాని అశోక్‌లను అదుపులోకి తీసుకొని 38 ప్లాస్టిక్ బ్యాగులు (1900 కిలోలు), కలర్ మిక్స్ చేసిన బ్యాగులు (680 కిలోలు), 250 కిలోల నాన్ బీటి స్మాల్ పౌచ్ బ్యాగ్స్‌, పదమూడు సర్పంచ్ గోల్డ్ బీజీ-2 కాటన్ సీడ్ ప్యాకెట్స్, 500బిల్లా, పావని బ్రాండ్ల ప్యాకింగ్ కవర్లు, విత్తనాలను నకిలీ చేసే రెడ్ కలర్ టిన్, మిక్సింగ్ చేసే మిషన్, మూడు ప్యాకింగ్ మిషన్లతో కలిపి మొత్తం రూ.50 లక్షల విలువ చేసే విత్తనాలు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ భగవత్ వివరాలను వెల్లడించారు. విడి పత్తి విత్తనాలను రసాయనాలతో కలిపి ప్యాకింగ్‌ చేస్తున్నారన్న పక్కా సమాచారం ఎస్వోటీ పోలీసులకు అందడంతో వ్యవసాయ అధికారులతో కలిసి దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు సీపీ వెల్లడించారు. ఆపరేషన్‌‌లో పాల్గొన్న ఎస్వోటీ పోలీసులకు సీపీ అభినందనలు తెలిపారు. సమావేశంలో అడిషనల్ సీపీ సుధీర్ బాబు, ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి, హయత్‌నగర్ మండల వ్యవసాయ అధికారి బిక్యా సల్మాన్ నాయక్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed