- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూరగాయలు అమ్ముతున్న సుధామూర్తి.. ఇందులో నిజమెంత?
దిశ, వెబ్‌డెస్క్:
కోట్ల రూపాయల డబ్బున్నా.. ఎంతో నెమ్మదిగా, అందరితోనూ కలుపుగోలుగా ఉంటారని ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ సుధా మూర్తిని అందరూ ప్రశంసిస్తుంటారు. ఈ నేపథ్యంలో గత రెండ్రోజులుగా ఆమెకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసినవాళ్లందరూ ఆమె గొప్పదనాన్ని విపరీతంగా పొగిడేస్తున్నారు. ఆమె గొప్పదనం నిజమే.. కానీ ఆ ఫొటోను మాత్రం జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారు. అందులో ఆమె చేస్తున్నది మంచి పనే.. కానీ అందరూ అనుకుంటున్న పని మాత్రం కాదు. ఇంతకీ ఏంటా ఫొటో? ఆ ఫొటోలో ఆమె ఏం చేస్తున్నారు?
ఈ వైరల్ ఫొటోలో ఆమె బెంగళూరులోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ముందు కూరగాయలు అమ్ముతున్నట్లుగా ఉన్నారు. తనలో అహాన్ని పోగొట్టుకోవడానికి ఇలా మఠం దగ్గర ఏడాదిలో ఒకరోజు ఇలా కూరగాయలు అమ్ముతుంటారని పోస్ట్‌లు వైరల్ చేస్తున్నారు. అయితే దీని గురించి ఫ్యాక్ట్ చెక్ చేస్తే తెలిసిందేంటంటే.. ఆమె కూరగాయలు అమ్మడం లేదు. మఠంలో చేసే సేవలో భాగంగా కిచెన్‌లోకి వెళ్లాల్సిన కూరగాయల లెక్క చూస్తున్నారు. అవును.. గత కొన్నేళ్లుగా ఆమె వివిధ దేవాలయాల్లో జరిగే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా వచ్చిన భక్తులకు భోజనాలు సిద్ధం చేయడం, పండ్లు కడగడం, కూరగాయలు కోయడం వంటి పనులను ఆమె చేస్తుంటారు. మఠం అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ఆమె వారి మఠంలో మూడు రోజుల పాటు స్టోర్ మేనేజర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా భోజనాలకు అవసరమైన కూరగాయల లెక్క చూస్తున్నపుడు ఆ ఫొటోను తీసినట్లు మఠం అధికారులు వెల్లడించారు.