రాపర్స్ కోసం ఫేస్‌బుక్ స్పెషల్ యాప్ ‘బార్స్’

by Sujitha Rachapalli |
రాపర్స్ కోసం ఫేస్‌బుక్ స్పెషల్ యాప్ ‘బార్స్’
X

దిశ, ఫీచర్స్ : భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఇండియాలో నిషేధించబడిన ‘టిక్ టాక్ యాప్’ మాదిరి ఫేస్‌బుక్ ఓ యాప్‌ను రూపొందించింది. ఇంటర్నల్‌ ఆర్ అండ్‌ డి గ్రూప్ న్యూ ప్రొడక్ట్ ఎక్స్‌పరిమెంటేషన్ (NPE) టీమ్.. ప్రత్యేకంగా రాపర్ల(సింగర్స్) కోసం ఈ బార్స్ (BARS)‌ యాప్‌ను ప్రయోగాత్మకంగా తయారు చేసింది. సింగర్లు ఎవరైనా తమ ర్యాప్‌ను సిద్ధం చేసి ఈ యాప్‌లో పోస్ట్ చేయొచ్చు. ఈ యాప్‌ ఫేస్‌బుక్‌ నుంచి వచ్చిన రెండో మ్యూజిక్‌ యాప్‌ కాగా.. మొదట ‘కొల్లాబ్’ అనే మ్యూజిక్ వీడియో యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఆల్రెడీ బార్స్ యాప్‌లో పొందుపరిచిన క్రియేటివ్ బీట్స్ ఆధారంగా రాపర్స్ తమకు నచ్చినట్లు లిరిక్స్ రాసుకుని సాంగ్ రికార్డ్ చేసుకోవచ్చని, బార్స్ యాప్ ఆటోమేటిక్‌గా మ్యూజిక్ బీట్స్ అందిస్తుందని ఫేస్‌బుక్ తన బ్లాగ్‌లో పేర్కొంది. కాగా, ఈ యాప్ ప్రస్తుతం బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

Advertisement

Next Story