- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉల్లి ‘ఘాటు’ ప్రకటన.. బ్యాన్ చేసిన ఫేస్‌బుక్
దిశ, వెబ్‌డెస్క్ : సినిమాకు ట్రైలర్ ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో.. ఓ ప్రొడక్ట్ అమ్ముడుపోవాలంటే, ప్రకటన కూడా అంతే ప్రభావం చూపుతుంది. అది వీడియో ప్రకటన, హోర్డింగ్, న్యూస్‌పేపర్ లేదా సోషల్ మీడియా పోస్ట్.. ఇలా ఆ యాడ్ ఏ రూపంలో అయినా ఉండొచ్చు. కంపెనీలు మాత్రం తమ ప్రకటన జనాల్లోకి చొచ్చుకుపోవాలని చూస్తుంటాయి. అందుకోసమే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటాయి. అయితే, కెనడాకు చెందిన ఓ విత్తన సంస్థ.. తమ ఆనియన్ సీడ్ విక్రయాల కోసం ఇచ్చిన ఓ ప్రకటనను ఫేస్ బుక్ బ్యాన్ చేసింది. ఎందుకో తెలుసా.. అది ఓవర్ సెక్సువల్‌గా ఉందట? అంతగా ఆ యాడ్‌లో ఉన్న బూతేంటో అర్థం కాక నెటిజన్లు మీమ్స్, జోక్స్ పేలుస్తున్నారు.
ఈడబ్ల్యూ గేజ్ అనే సీడ్ కంపెనీ ‘ఆనియన్ సీడ్స్’ మీద స్పెషల్ ఆఫర్ ఇస్తున్నట్లు ఇటీవలే ఫేస్‌బుక్‌లో ఓ యాడ్ పోస్ట్ చేసింది. ఆ యాడ్‌లో ఏముందంటే.. ఓ బుట్టనిండా ఆనియన్స్ ఉన్నాయి. ఆనియన్స్ విత్తనాల ధర 1.99 డాలర్లు (రూ. 145)గా నిర్ణయించారు. ‘ఇవి చాలా తియ్యగా ఉంటాయి. విత్తనాల నుంచి వచ్చే చిన్న, పెద్ద ఆనియన్స్ చాలా త్వరగా మొలకెత్తుతాయి. కేవలం 95 – 170 రోజుల్లోనే ఇవి మెచ్యూర్ అవుతాయి. మంచి ఫ్లేవర్‌తో, పెద్ద సైజులో ఉండే ఈ ఉల్లిగడ్డలు.. స్లైసింగ్ చేయడానికి, సలాడ్స్ కోసం, ఫ్రైయింగ్, బేకింగ్, ఆనియన్ రింగ్స్ చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటాయి’ అని ఉంది. ఈ యాడ్ చూసిన ఫేస్‌బుక్ నిర్వాహకులు ఇది తమ నిబంధనలను విరుద్ధంగా ఉందని, ఆ ఫోటో చాలా ఓవర్ సెక్సీగా ఉందని, అందులో ద్వందార్థాలు ఉన్నాయని బ్యాన్ చేస్తున్నామని తెలిపారు. ఆనియన్స్ యాడ్‌లో ద్వందార్థం ఉండటం వల్లే ఫేస్‌బుక్ యాడ్ బ్యాన్ చేసిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతుంటే, మరికొందరు మాత్రం అందులో ఎలాంటి తప్పులేదని కామెంట్లు పెడుతున్నారు.
‘ఇది చాలా ఫన్నీగా ఉంది. అందులో ఎలాంటి సెక్సువాలిటి లేదు’ అని కంపెనీ మేనేజర్ జాక్సన్ మెక్‌లీన్ తెలిపారు. ప్రస్తుతం కంపెనీ కూడా ఫొటోతో పాటు, మ్యాటర్ రిస్టోర్ చేయగా, ఫేస్‌బుక్ కూడా తాము చేసిన పనికి అపాలజీ చెప్పింది.