ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ల కోసం ‘ఇన్‌స్టా లైట్ వెర్షన్’

by Shyam |
ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ల కోసం ‘ఇన్‌స్టా లైట్ వెర్షన్’
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్స్‌లో ప్రముఖ యాప్స్(ఫేస్‌బుక్, మెసెంజర్, ట్విట్టర్, వాట్సాప్) ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే స్టోరేజ్ సమస్య తలెత్తుంది. ఒకవేళ సదరు యాప్స్ ఓపెన్ చేయాలన్నా సరే.. ఫోన్ చాలా స్లోగా రన్ అవుతుంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే ప్రముఖ కంపెనీలన్నీ కూడా తమ ఒరిజనల్ యాప్స్‌కు, లైట్ వెర్షన్‌ను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే ఫేస్‌బుక్.. తన మెసెంజర్‌ యాప్‌కు లైట్ వెర్షన్ తీసుకురాగా, తాజాగా ఇన్‌స్టా కూడా లైట్ వెర్షన్ ఇంట్రడ్యూస్ చేసింది.

నెట్‌వెర్క్ సరిగా లేకపోయినా, మొబైల్‌లో 2జీ నెట్‌వర్క్ ఉన్నా గానీ బఫర్ కాకుండా ఓపెన్ అయ్యే విధంగా ఇన్‌స్టా లైట్ యాప్‌ను తీసుకొచ్చింది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఇన్‌స్టా లైట్.. కేవలం 2ఎంబీ స్పేస్ మాత్రమే తీసుకోనుండగా, ప్రాసెసింగ్ పవర్ కూడా చాలా తక్కువగా అవసరమవుతుంది. బేసిక్, ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ల వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన ఈ లైట్ యాప్‌లోని ఇంటర్‌ఫేస్‌లు ఇన్‌స్టాగ్రామ్ పాత వెర్షన్‌ను పోలి ఉంటాయని ఫేస్‌బుక్ తెలిపింది. తక్కువ డేటాతోనే దీన్ని యాక్సెస్ చేసుకునే వీలుంది.

ఇక ఇన్‌స్టా లైట్ యాప్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలన్నీ స్టాండర్డ్ వీడియోలుగా ప్లే అవుతాయి. ఇంటర్నెట్ వేగం తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంత వినియోగదారులను, ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ వాడే కస్టమర్లను ఆకట్టుకునేందుకు మొదటగా ఇండియాలోనే ఈ లైట్ వెర్షన్‌ను ఇంట్రడ్యూస్ చేసింది ఫేస్‌బుక్. ఇండియాలో సక్సెస్ సాధిస్తే, ఇతర దేశాల్లోనూ ఈ వెర్షన్‌ను తీసుకొస్తామని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed