- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేనల్లుడి భార్యతో మామ ఎఫైర్.. ఇంట్లోనుంచి పారిపోయి అక్కడ, అలా దొరికి
దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పరాయి వారిపై మోజు.. ఎన్నో కుటుంబాలలో చిచ్చు పెడుతోంది. దీని కారణంగానే హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు. వావి వరుసలు మరిచి, సొంత ఇంట్లోవారితోనే వివాహేతర సంబంధాలను కొనసాగించడం, ఆ సంబంధం బయటపడిపోవడంతో ఆత్మహత్య చేసుకోవడం లాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. తాజాగా వరుసకు తండ్రికూతుళ్లు అయ్యే ఇద్దరు తమ వివాహేతర సంబంధం ఇంట్లో తెలియడంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఛత్తీస్ ఘడ్ లో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. బిలాస్‌పూర్ జిల్లా బెల్హా తాలూకాలోని కనేరి గ్రామానికి చెందిన ఖేలూ రామ్ కేవత్(50) కుటుంబం నివసిస్తోంది. అతనికి నలుగురు పిల్లలు.. భార్య కొన్నేళ్ల క్రితం మృతిచెందడంతో ఒంటరిగా పిల్లలతో కలిసి ఉంటున్నాడు. వారి ఇంటి పక్కనే అతని మేనల్లుడు, ఆమె భార్య గీత(35) నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా, గీత భర్త గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో వారి వ్యవసాయ పనులను మేనమామ ఖేలూ రామ్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఖేలూ రామ్, గీతకు మధ్య చనువు ఏర్పడింది. ఆ చనువు కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
భార్య మృతిచెందడంతో ఖేలూ రామ్, గీతకు శారీరకంగా దగ్గరయ్యాడు. ఇంట్లో భర్త, పిల్లలు లేని సమయంలో వారిద్దరు కలుస్తుండేవారు. ఇక ఇలా సాగుతున్న వీరి సంబంధం ఇటీవల ఇరు కుటుంబాల్లో తెలిసిపోయింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు వీరిని హెచ్చరించారు. దీంతో తమ సంబంధం బయటపడిందని, పరువు పోయిందని అనుకోన్న వారు గతనెల మార్చిలో ఇల్లు వదిలి పారిపోయారు. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆదివారం సొంతూరికి వచ్చిన వారు ఒక చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం వారి మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.