- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డాక్టర్లపై బరువైన బాధ్యత.. పనిగంటలు పెంచిన ప్రభుత్వం
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులందరూ సాయంత్రం నాలుగు గంటల తర్వాత కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ముగింపు సమయానికి మరో నాలుగు గంటలు అదనంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తాజాగా జారీ చేసిన అంతర్గత ఆదేశాల్లో వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో సాయంత్రపు క్లినిక్ (ఈవెనింగ్ క్లినిక్)లను మళ్లీ ప్రారంభించాలని పేర్కొన్నది. ప్రతి మెడికల్ ఆఫీసర్, ఆయా కేంద్రాల్లో పనిచేసే సహాయక సిబ్బంది ఆసుపత్రులకు దగ్గర్లోనే నివాసం ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని వివరించింది. ప్రస్తుతం కరోనాతో పాటు సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున కొన్నాళ్ల పాటు ఈ మార్గదర్శకాలను పాటించాలని వైద్యశాఖ ఉన్నతాధికారులకు ప్రభుత్వం సూచించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో క్లినిక్‌లకు వచ్చిన బాధితులకు అవసరమైన మందులను పంపిణీ చేయడంతో పాటు, వ్యాధి నిర్ధారణ కోసం రక్త నమూనాలు సేకరించి ‘తెలంగాణ డయాగ్నోస్టిక్స్‘కి పంపాలని స్పష్టంచేసింది. మరోవైపు ప్రతీ ఐదు డయాగ్నస్టిక్ కేంద్రాల్లోని డాక్టర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. పేషెంట్ల రద్దీని బట్టి ఆయా సెంటర్లకు వెళ్లి చికిత్స అందించేలా ప్లాన్ చేసుకోవాలని సూచించింది. జ్వరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని, జ్వర సర్వేతో పాటు, వ్యాధుల నియంత్రణ కోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ ,ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ సమన్వయంతో కలసి పనిచేయాలని వైద్య అధికారులకు సీఎం కేసీఆర్ సూచించినట్లు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని వ్యాధులను అరికట్టాలని వైద్యశాఖకు ప్రభుత్వం సూచించింది. నీళ్ళ ద్వారా టైఫాయిడ్, కలరా, హెపటైటిస్, సాధారణ ఫ్లూ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు వాటిపై అవగాహన కల్పించాలని సూచించింది. ఈ సీజన్‌లో దోమల వల్ల ఎక్కువ జబ్బులు వచ్చే అవకాశం ఉన్నదని, వాటిని నివారిస్తే మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, వైరల్ జ్వరాలను నియంత్రించవచ్చని స్పష్టంచేసింది. ఆసిఫాబాద్, భద్రాచలం, జీహెచ్‌ఎంసీ పరిధిలో వైరల్ ఫీవర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సాధారణంగా సెప్టెంబర్‌లో విజృంభించే స్వైన్ ఫ్లూను అరికట్టేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కోరింది. అన్ని జిల్లాల్లో డెంగ్యూ కోసం అవసరమైన రాపిడ్ కిట్లనూ అందుబాటులో ఉంచాలని నొక్కిచెప్పింది.
గ్రామాల్లో గర్భిణులకు ఇబ్బందులు రాకూడదు
ప్రసవం కోసం ఏ గర్భిణీ కూడా ఇబ్బంది పడకుండా చూడాలని కుటుంబ సంక్షేమ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రతి గర్భిణీ డెలివరీ తేదీ ప్రకారం వైద్య సేవలు అందించేలా చూడాలని సూచించింది. డెలివరీ డేట్ కంటే ముందే వారిని ఆసుపత్రికి తరలించాలని వివరించింది. వారికి అవసరమైన రవాణా సదుపాయాలను ప్రభుత్వమే కల్పించాలని స్పష్టం చేసింది.