అదనపు చార్జీల భారం తగ్గేనా?

by Shamantha N |
అదనపు చార్జీల భారం తగ్గేనా?
X

దిశ,వెబ్ డెస్క్: ఎప్పుడెప్పుడా అని రెగ్యులర్ రైళ్ల కోసం ఎదురు చూసే ప్రయాణికుల ఆశలు ఆవిరైనట్టే అని చెప్పవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లలో కొన్నింటిని జూన్ నెలాఖరు వరకు, మరికొన్నింటిని జులై తొలి వారం వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ‘ప్రత్యేకం’ అనే ట్యాగ్ తీయకుండా అదనపు చార్జీలతో రైళ్లను నడిపిస్తున్నారు. దీని ఫలితంగా ప్రయాణికుల పై అదనపు చార్జీల మోత తగ్గడంలేదు. రెగ్యులర్ రైళ్లు వస్తాయేమో అదనపు చార్జీల భారం తగ్గుతుంది అనుకున్న ప్రయాణికుల ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. గోదావరి, శబరి, సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లను అవే రూట్లలో, అవే సమయాల్లో నడిపిస్తున్నా వాటిని ప్రత్యేక రైళ్లుగానే పరిగణిస్తూ అదనపు వడ్డన వడ్డిస్తున్నారు. రైల్వే తీరుపై ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతేడాది కరోనా వలన రైల్వే రాకపోకలు నిలివేసింది ప్రభుత్వం. ఇప్పుడిప్పుడే పలు జాగ్రత్తలు తీసుకుంటూ అవసరార్థం రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం 80 శాతానికిపైగా రైళ్లను పునరుద్ధరించినట్టు ఇటీవల రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 80శాతానికి రైళ్లను పునరుద్ధరించిన ప్రయాణికులకు అదనపు చార్జీల భారం మాత్రం తప్పడం లేదు.

Advertisement

Next Story

Most Viewed