- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సింగరేణిలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులు మృతి
రామగుండం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో నలుగురు సింగరేణి కార్మికులు మృత్యువాత పడ్డారు. బొగ్గు నిక్షేపాల కోసం ఓపెన్ కాస్ట్ లో మందుగుండు సామాగ్రిని ఉపయోగించి పేలుస్తుంటారు. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిదన్న విషయాన్ని ఇంకా సింగరేణి అధికారులు వివరించలేదు. పూర్తి వివరాలను కొద్దిసేపట్లో తెలియజేస్తామని చెప్తున్నారు. మృతులంతా కాంట్రాక్టు కార్మికులుగా తెలుస్తోంది. భూమిలోపల ఉన్న బొగ్గు కోసం హోల్స్ చేసి అందులో మందుగుండు సామాగ్రిని నింపుతారు. ఆ తరువాత బ్లాస్టింగ్ కోసం డిటోనేటర్లకు కనెక్షన్ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే పేలుడు సంభవించడంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు గోదావరిఖనికి చెందిన బి ప్రవిణ్ (38), ఎస్ రాకేశ్, కమన్ పూర్ కు చెందిన బిల్ల రాజేశం (42), అర్జయ్య (41)గా గుర్తించారు. జూలపల్లికి చెందిన బండి శంకర్ (31), శాలపల్లికి చెందిన వెంకటేశ్, భీమయ్యలు అనే మరో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. వీరిని గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలిసిన వెంటనే పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లు అక్కడికి చేరుకున్నారు. ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకుని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేలందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.