స్క్రాప్ దుకాణంలో భారీ పేలుడు.. ముగ్గురు దుర్మరణం

by srinivas |   ( Updated:2021-12-14 09:39:31.0  )
explosion1
X

దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని ఓ స్క్రాప్ దుకాణంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని 2వ డివిజన్‌ పరిధిలోని భాగ్యనగర్‌లో ఉన్న స్క్రాప్ దుకాణంలో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో లింగేశ్వరరెడ్డి, రసూల్‌ బి మృతి చెందారు. మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రగాయాలపాలైన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

explosion

ఎమ్మెల్యే పరామర్శ

ఈ ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన కుటుంబాలను ఆదుకుంటామని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. విషయం తెలియగానే ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాద ఘటన బాధాకరమన్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందజేయాలని వైద్యులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట మేయర్‌ మహమ్మద్‌ వసీం, డిప్యూటీ మేయర్‌ కోగటం విజయభాస్కర్‌రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గౌస్‌ బేగ్, వైసీపీ నేతలు రవి, లక్ష్మన్న తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed