దిశ చట్టం ద్వారా ఉరిశిక్షలు విధించవచ్చు : సుచరిత

by srinivas |
Home Minister Sucharita
X

దిశ, ఏపీ బ్యూరో: దిశ చట్టం అమలులోకి వస్తే అత్యాచార నిందితులకు 7 రోజుల్లోనే శిక్ష విధించవచ్చని రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత స్పష్టం చేశారు. అంతేకాదు అత్యాచారాలపై దిశ చట్టం ద్వారా ఉరిశిక్షలు సైతం విధించవచ్చన్నారు. కృష్ణా జిల్లా జగ్గంపేట మండలం రాగంపేటలో ఆదివారం దిశ యాప్ అవగాహన సదస్సులో హోం మంత్రి సుచరిత పాల్గొన్నారు.

మహిళల సంరక్షణ, భద్రత కోసం సీఎం వైఎస్ జగన్ దిశచట్టం తీసుకువచ్చారన్నారు. అయితే దిశ బిల్లు ఇంకా చట్టరూపం దాల్చలేదన్నారు. ఇటీవలే కేంద్రంతో రాష్ట్ర మహిళా ఎంపీలు కలిసి దిశచట్టం ఏర్పాటుకు సహకరించాలని కోరినట్లు మంత్రి సుచరిత గుర్తు చేశారు. దిశ చట్టం కేసులకు సంబంధించి రాష్ట్రంలో ప్రత్యేక కోర్టులు.. తక్షణ సహాయం కోసం దిశ యాప్ ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. దిశ యాప్‌ను యువతులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలి హోంమంత్రి సుచరిత పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed