బిపిన్‌ రావత్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యాలు (ఎక్స్‌క్లూజివ్ వీడియో)

by Anukaran |   ( Updated:2023-03-28 18:47:59.0  )
బిపిన్‌ రావత్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యాలు (ఎక్స్‌క్లూజివ్ వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్:ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో డిఫెన్స్ చీఫ్ ఆరోగ్య పరిస్థితిపై కేంద్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ప్రమాదంలో ఆయన మరణించినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. రేపు పార్లమెంట్‌లో బిపిన్ రావత్ ఆరోగ్య పరిస్థితి, హెలికాప్టర్ ప్రమాదంపై కేంద్రం క్లారిటీ ఇవ్వనుంది.

అయితే ప్రమాదం తర్వాత బిపిన్ రావత్ ప్రాణాలతోనే ఉన్నట్లు ప్రస్తుతం బయటకు వస్తున్న వీడిమోలను బట్టి చూస్తే తెలుస్తోంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన అధికారులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బిపిన్ రావత్‌కు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ లో 14 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు ప్రకటించగా.. 13 మంది చనిపోయినట్లు ANI తెలిపింది. డీఎన్‌ఐ టెస్టుల ద్వారా మృతదేహాలను గుర్తించారు.

బిపిన్ రావత్ ప్రమాదానికి గురి అయిన హెలికాప్టర్‌ వివరాలు.

Advertisement

Next Story