- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలా పిలిచారు..ఇలా వచ్చారు
దిశ, కరీంనగర్
లాక్ డౌన్ సందర్భంగా వాలంటీర్‌గా సేవలందించేందుకు యువత ముందుకు రావాలని సీపీ కమలాసన్ రెడ్డి పిలుపునిచ్చిన గంటల్లోనే యువత నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కమిషనరేట్ పరిధిలోని అన్ని చోట్ల సేవలందించేందుకు వాలంటీర్లు కావాలని ఔత్సాహికులు వాట్సప్ ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు జిల్లాలోని యువత ఇప్పటికే 400 మందికి పైగా పోలీసులను సంప్రదించారు.
ఎన్‌సీసీ ఉంటే ప్రాధాన్యత..
వాలంటీర్లుగా అందరికీ అవకాశం ఇవ్వకుండా వారి నిబంధనలకు అనుగుణంగా ఉన్న వారిని ఎంపిక చేస్తున్నారు. ఇందుకు 35 ఏండ్లలోపు ఉన్న యువకులు, ఎన్సీసీ కేడెట్లు, స్కౌట్స్ అండ్ గౌడ్స్‌కు సంబంధించిన వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే వినాయక నవరాత్రి ఉత్సవాల్లో యాక్టివ్ గా ఉండి లా అండ్ ఆర్డర్ కు అనుగుణంగా పనిచేసిన వారిని గుర్తించి వారికి మాత్రమే వాలంటీర్లుగా అవకాశం ఇస్తున్నారు.
సామూహిక దూరమే లక్ష్యంగా..
కరీంనగర్ సీపీ కార్యాలయంలో ఫైనల్ చేసిన యువత లిస్టును వివిధ శాఖలకు పంపిస్తున్నారు. దుకాణాలు, కూరగాయల మార్కెట్ ల వద్ద సామూహిక దూరం పాటించేలా వీరి ఉయోగించుకోవాలని భావిస్తున్నారు. అలాగే రోడ్డు స్టాపర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో కూడా వాలంటీర్లను నియమించి వాహనాలను దారి మళ్లించేలా వారికి బాధ్యతలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కరీంనగర్ కూరగాయల మార్కెట్ వద్ద వాలంటీర్ల సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
Tags: karimnagar,cp kamalasan reddy,volunteers,full response