- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎల్ఆర్ఎస్ పెట్టి ఖజానాను నింపుకోం
దిశ ప్రతినిధి, మెదక్: టీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి ఎల్ఆర్ఎస్ అని పెట్టి ఖజానా నింపుకోవాలని బీజేపీ చూడదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో రైతులకు అడుగడుగునా ఆంక్షలు విధించారన్నారు. రైతుల స్వేచ్ఛకోసమే వ్యవసాయ బిల్లు తీసుకొచ్చారని.. తాము పండించిన పంటను నేరుగా రైతులే అమ్ముకోవచ్చన్నారు. ఏ రంగానికి ఎంత కరెంట్ అవసరమో తెలపడానికే మీటర్లు పెట్టడం జరుగుతుందని, దీని ద్వారా రైతులను ఇబ్బంది పెట్టాలని కాదని తెలిపారు. ఈ బిల్లులో ఉన్న సౌకర్యాలు కాంగ్రెస్ నేతలకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. రైతు బిల్లులో సీఎం కేసీఆర్కు లోపాలు కనిపిస్తే రౌండ్ టేబుల్ సమావేశంపెట్టి మాట్లాడాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలు కూడా తమవే అని అబద్దాలు చెప్పుకుంటూ సీఎం కేసీఆర్ బతకొద్దని ఎద్దేవా చేశారు.