మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

by Shamantha N |   ( Updated:2021-04-23 01:06:29.0  )
మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా శనివారం వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు ఐసోలేషన్‌లో ఉండాలని కోరుతున్నాను. వారంతా విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని విన్నవించు కుంటున్నాను” అని ట్వీట్ చేశారు. కాగా ఇటీవల కుమార స్వామి తండ్రి, మాజీ ప్రధాని దేవేగౌడకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed