- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల ప్రచారానికి విదేశీ నిధులు.. ఆ దేశ మాజీ అధ్యక్షుడికి జైలు శిక్ష
దిశ,వెబ్‌డెస్క్: మనదేశంలో వేలకోట్లు లూటీ చేసిన వాళ్లు దర్జాగా బ్రతికేయొచ్చు. కానీ ఫ్రాన్స్ లాంటి దేశాల్లో ఎంతటి వాడికైనా శిక్ష పడాల్సిందే. నికోలస్ సర్కోజీ 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా పనిచేశారు.
అయితే 2007 ఎన్నికల ప్రచారంలో లిబియా నుంచి ఆర్థిక సహాయం పొందారు. 2012 అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన తర్వాత సర్కోజీపై పలు ఆర్ధిక ఆరోపణలు తలెత్తాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీస్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సర్కోజీ, ఆయన న్యాయవాది థియరీ హెర్జోగ్ లు జరిపిన టెలిఫోన్ సంభాషణల్లో లిబియానుంచి ఆర్ధిక సాయం పొందినట్లు తేలింది.
అంతేకాదు ఓవైపు సర్కోజీ అధ్యక్షుడిగా కొనసాగే సమయంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆర్ధిక సమాచారాన్ని తమకు అందించినందుకు గానూ మొనాకోకు చెందిన న్యాయమూర్తి గిల్బర్ట్ అజిబర్ట్‌కి పదోన్నతిని కల్పించారు. అయితే సర్కోజీ ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలపై ఫ్రెంచ్ కోర్ట్ సోమవారం తీర్పిచ్చింది. ఆయనను దోషిగా తేల్చి, మూడేండ్లు జైలు శిక్ష విధించింది. ఇందులో రెండు ఏండ్లను సస్పెండ్ చేసింది. దీంతో ఆ దేశ నిబంధనల ప్రకారం నికోలస్ సర్కోజీ ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.