- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృతి
దిశ ప్రతినిధి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బి. కృష్ణ (80) కన్నుమూశారు. సోమవారం గోషామహల్ లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డికి కుడిభుజంగా ఈయనకు గుర్తింపు ఉంది. 1978లో ఆయన ఆసీఫ్ నగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 1983 వరకు కొనసాగారు. తెలంగాణ తొలి దశ ఉద్యమం 1969లో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించారు. కాగా గతకొంత కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
ఈయనకు భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. టీఆర్ఎస్ గ్రేటర్ నాయకులు బెజిని శ్రీనివాస్ కు కృష్ణ స్వయంగా మామ అవుతారు. ఇదిలా ఉండగా ఆయన మృతి పట్ల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, టీఆర్ఎస్ నాయకులు కడ్లి రాజశేఖర్, శంకర్ లాల్ యాదవ్, కార్పొరేటర్లు మమతా సంతోష్ గుప్తా, ముఖేష్ సింగ్ లతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా ఆయన చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకున్నారు.