- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైజాగ్ టూర్ అవమానంపై బాబు గుస్సా!
విశాఖపట్టణంలో నిన్న చోటుచేసుకున్న పరిణామాలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన ఆయన వరుస ట్వీట్లలో ప్రభుత్వం, పోలీసుల వ్యవహారశైలిపై మండిపడ్డారు. వరుసగా ఆయన చేసిన నాలుగు ట్వీట్ల వివరాల్లోకి వెళ్తే…
“విశాఖ, విజయనగరంలో యాత్రకు అనుమతి అడిగితే మాకు ఎన్నో ఆంక్షలు పెట్టిన పోలీసులు, విమానాశ్రయం వద్దకు వందలాది వైసీపీ కార్యకర్తలను ఎలా అనుమతించారు? ఆందోళనకారుల ముసుగులో వచ్చిన వైసీపీ కార్యకర్తలను నియంత్రించలేని వాళ్ళు నన్ను అరెస్టు చేయడం సిగ్గుచేటు. ఇది ప్రభుత్వ వైఫల్యమే” అని ఆయన స్పష్టం చేశారు.
రెండో ట్వీట్‌లో “హుద్ హుద్ బీభత్సంతో చెల్లాచెదురైన విశాఖ ఎయిర్ పోర్ట్ ను మేమే దగ్గరుండి పునర్నిర్మించాం. సుందరంగా ఎయిర్ పోర్ట్ ను రూపొందించడంతోపాటు, మొత్తం విశాఖ నగరాన్ని అందంగా తీర్చిదిద్దాం. అదే ఎయిర్ పోర్ట్ వద్ద నన్ను అడ్డుకోవడం, గంటల తరబడి నిలిపేయడం విశాఖవాసులు ఎవరూ చేయరు. ఇది ఖచ్చితంగా వైసీపీ అరాచక శక్తుల పనే.. నా పర్యటన అడ్డుకునేందుకు ఇతర జిల్లాల నుంచి వైసీపీ కార్యకర్తలను తరలించడం హేయం” అంటూ ఆయన వైఎస్సార్సీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడో ట్వీట్‌లో “పోలీసుల అనుమతి ఉన్నా యాత్రను అడ్డుకున్నారంటే, ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతోంది. వైసీపీ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. ఈ దుర్మార్గాన్ని అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు నిరసించాలి. సేవ్ ఆంధ్రప్రదేశ్! సేవ్ డెమొక్రసీ” అంటూ ట్వీట్ చేశారు.