అవకాశమున్న ప్రతి ఒక్కరూ విధుల్లో చేరండి: ఏపీ ప్రభుత్వం

by srinivas |
అవకాశమున్న ప్రతి ఒక్కరూ విధుల్లో చేరండి: ఏపీ ప్రభుత్వం
X

దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ అమలవుతోంది. కరోనా ప్రబలేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించడం లేదు. ఊరందరిదీ ఒకదారి ఉలిపిరికట్టెది మరొకదారి అన్నట్టు.. తెలంగాణ సహా రాష్ట్రాలు కఠిన లాక్‌డౌన్ అమలు చేస్తుంటే. ఏపీ మాత్రం లాక్‌డౌన్ సడలింపులిచ్చింది. అంతటితో ఆగకుండా సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ విధులకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

లాక్‌డౌన్‌ ప్రకటించిన అనంతరం ప్రభుత్వం వర్క్‌ ఫ్రం హోంకు ఆదేశాలు జారీ చేసింది. విభాగాధిపతులు, ముఖ్యమైన వారిని రెండు బృందాలుగా విభజించి ఒక్కో వారం ఒక బృందానికి విధులు అప్పగించాలని గతంలో జారీ చేసిన ఆదేశాల్లో కోరింది. అంతేకాకుండా వీలైనంత సామాజిక దూరం పాటిస్తూ వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని సూచించింది. ఇప్పుడు అంతా విధులకు హాజరుకావాలని సూచిస్తోంది. సచివాలయ ఉద్యోగుల కోసం ప్రజా రవాణా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది.

Tags: ap assembly, employees, duty, sachivalayam, finance cs,

Advertisement

Next Story