‘ప్రతి ఒక్కరు లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలి’

by Shyam |
‘ప్రతి ఒక్కరు లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలి’
X

దిశ రాజేంద్రనగర్ : ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నిబంధనలు పాటించి కరోనా వైరస్ నుంచి రక్షణ పొందాలని శంషాబాద్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పవన్ గౌడ్ సూచించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి ప్రాణాలను హరిస్తున్న కరోనా వైరస్‌ను తరిమి కొట్టాలంటే అది లాక్‌డౌన్ తోనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రతిరోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్న తరుణంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించి ఇళ్లకు పరిమితం కావాలని అన్నారు. కరోనా సోకినా ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా ఉండాలని ఆ ధైర్యమే సగం వ్యాధిని తగ్గిస్తుందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వస్తే మాస్కులు, శానిటైజర్ వాడుతూ సామాజిక దూరం పాటించాలని పవన్ గౌడ్ తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed