ఢిల్లీలో ప్రతి ఇంటా స్క్రీనింగ్

by Shamantha N |
ఢిల్లీలో ప్రతి ఇంటా స్క్రీనింగ్
X

న్యూఢిల్లీ: కరోనాపై పోరాటాన్ని ఢిల్లీ ప్రభుత్వం మరింత ఉధృతం చేసింది. మహమ్మారి కట్టడి వ్యూహాన్ని మరింత మెరుగుచేసుకుంది. జూలై 6కల్లా ఢిల్లీలో ప్రతి ఇంటికి వెళ్లి స్క్రీనింగ్ టెస్టు నిర్వహించే టాస్క్‌కు సిద్ధమైంది. కంటైన్‌మెంట్ జోన్లలో నిబంధనల ఉల్లంఘనలను పసిగట్టేందుకు సీసీటీవీలు, డ్రోన్‌లను వినియోగించనుంది. ‘ఉల్లంఘనులను’ శిక్షించనుంది. కొవిడ్ 19 అరికట్టడానికి రూపొందించిన కొత్త ప్రణాళిక ప్రకారం, ఇప్పటివరకు ఉన్న అన్ని కంటైన్‌మెంట్ జోన్లను సమీక్షించి ఈ నెల 26లోపు మళ్లీ రీడిజైన్ చేస్తారు. ఈ నెల 30లోపు కంటైన్‌మెంట్ జోన్లలోని ప్రతి ఇంటి సభ్యులను స్క్రీన్ చేస్తారు. జూలై 6 కల్లా మిగతా ఢిల్లీ అంతా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తారు. ఢిల్లీలో కరోనా ఇన్ఫెక్షన్‌ను అంచనా వేసేందుకు సెరో సర్వేను చేపడతారు. జూన్ 27న మొదలుపెట్టి వచ్చే నెల 10లోపు ఈ సర్వేను పూర్తి చేస్తారు. డీసీపీ, మున్సిపల్ డీసీ, ఎపిడాలమజిస్ట్, జిల్లా సర్వెలెన్స్ అధికారి, ఆరోగ్య సేతును పర్యవేక్షించే ఐటీ ప్రొఫెనల్స్‌లతో నిఘా బృందాన్ని ఢిల్లీ సర్కారు మరింత పటిష్టం చేయనుంది. కంటైన్‌మెంట్ జోన్ల చుట్టూ సరిపడా బఫర్ జోన్లను ఏర్పాటు చేస్తారు. కరోనా పేషెంట్‌లను కొవిడ్ కేర్ సెంటర్‌లకు తరలించాలనే ప్రతిపాదన ఈ కొత్త ప్రణాళికలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా హైరిస్క్, లో రిస్క్ పేషెంట్‌లను ఢిల్లీ ప్రభుత్వం వర్గీకరించనుంది.

Advertisement

Next Story

Most Viewed