- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎన్టీఆర్ కంటే ఆయనే నయం.. సంచలన కామెంట్స్ చేసిన మహేష్ బాబు
దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ రియాల్టీ షో బుల్లితెర ప్రేక్షకులకు మధురమైన అనుభూతిని అందిస్తుంది. సాధారణ ప్రేక్షకులే కాకుండా స్టార్ హీరో హీరోయిన్లు కూడా ఈ షోలో సందడి చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదటి రోజే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్‌గా అటెండ్ అయి.. షో హైప్ పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకు సమంత, రాజమౌళి, కొరటాల శివ తదితరులు అతిథులుగా హాజరై ప్రేక్షకులను అలరించగా.. త్వరలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ షోలో సందడి చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేయగా.. తారక్, ప్రిన్స్ మధ్య ఆసక్తికర సంభాషణలు చోటుచేసుకున్నాయి.
‘వెల్‌కమ్ మహేష్ అన్న’ అంటూ ఎన్టీఆర్ సాదరంగా ఆహ్వానించగా..సెటప్ అదిరిపొయిందంటూ మహేష్ కాంప్లిమెంట్ ఇచ్చారు. సాధారణంగా హాట్ సీట్‌లో కూర్చున్న అందరినీ కన్‌ఫ్యూజ్ చేసే తారక్.. సూపర్ స్టార్‌ను సైతం కన్‌ఫ్యూజ్ చేసేందుకు ట్రై చేశాడు. దీంతో ప్రిన్స్.. క్వశ్చన్ అడిగాక అటుతిప్పి ఇటుతిప్పి ఎందుకు కన్‌ఫ్యూజ్ చేస్తావని అడగ్గా.. సరదాగా అంటూ తారక్ నవ్వేశాడు. దీంతో ‘నీకంటే గురువు గారే నయం’ అని నవ్వులు పూయించాడు మహేష్. దీనిపై నెటిజన్స్ ‘అన్నయ్య మిమ్మల్ని చూడ్డానికి రెండు కళ్లు సరిపోవట్లేదు.. ఇద్దరు టైగర్స్ కలిస్తే టెలివిజన్ అయినా, బాక్సాఫీస్ అయినా దద్దరిలాల్సిందే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.