- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అధికార పార్టీ కొత్త అవతారం.. ప్రజలచే ఈటలను తిట్టించే ప్రయత్నాలు’
దిశ, జమ్మికుంట: అధికార పార్టీ కొత్త అవతారం ఎత్తి, ఓ కుటుంబాన్ని రెచ్చగొట్టి తనను తిట్టిపిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం జమ్మికుంట పట్టణంలోని ఈటల కాంప్లెక్స్‌లో.. మండలంలోని వావిలాల, ధర్మారం, ఇల్లందకుంట మండల కేంద్రం, కమలాపూర్ మండలంలోని మాదన్నపేట గ్రామాలకు చెందిన పలువురు ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం నేనొక ఒక ఊరికి వెళితే అక్కడ ఓ కుటుంబంతో టీఆర్ఎస్ నేతలు తిట్టించారన్నారు. నేను ఉద్యోగం పెట్టించిన ఇంటి పెద్ద చనిపోతే ఆయన భార్యకు ఆ ఉద్యోగం వచ్చేలా చేశానని, గతంలో వారి కుమారుడికి కూడా ఉద్యోగం ఇప్పించానని.. చివరకు సదరు కుటుంబ సభ్యులను రెచ్చగొట్టి తనను తిట్టిపించారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎన్ని చేసినా ప్రజల మద్దతు తనకు ఉందని రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఏం చేసినా గెలవమని తెలిసే కేసీఆర్ ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. ‘హుజురాబాద్‌లో నన్ను బొంద పెట్టి, అసెంబ్లీలో నా ముఖం కనిపించకుండా చేస్తారట..? అది సాధ్యమయ్యే పనేనా’ అంటూ ప్రశ్నించారు. హుజురాబాద్ ప్రజలు చైతన్యవంతులని, కేసీఆర్ మాయమాటలు నమ్మరన్నారు. ఇంటికో దళిత బంధు వద్దని నేను రాసినట్టు దొంగ లెటర్ పుట్టించి, ఆ దొంగ లెటర్ మీద ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కంటే ముందే దళిత బంధు అన్ని కుటుంబాలకు ఇవ్వాలని తాను మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
గత నాలుగు నెలలుగా హుజురాబాద్ ప్రాంతం ప్రశాంతత కోల్పోయిందని, పచ్చని సంసారంలో చిచ్చు పెడుతూ, నాతో ఉన్న నాయకులందరినీ కొనుగోలు చేస్తూ ఊరూరా దావతు ఇస్తున్నారని ఆరోపించారు. ఎన్ని డబ్బులు ఇచ్చినా.. ఎన్ని దావతులు ఇచ్చినా.. దళిత బంధు ఇచ్చినా.. ఇవన్నీ ఈటల రాజేందర్ వాళ్లనే వచ్చాయని ప్రజలే కుండబద్ధలు కొట్టినట్టు చెబుతున్నారన్నారు. ఇన్ని చేసినా ప్రజలు ఈటల రాజేందర్‌కి ఓటు వేస్తామని చెప్పడంతో, ఏం చేయాలో అర్ధం కాక చిల్లర పనులకు పాల్పడుతున్నారన్నారు. మన ఓటు మనం వేసుకొని కేసీఆర్ అహంకారాన్ని అణచి వేద్దామని ఈటల రాజేందర్ ఓటర్లకు పిలుపునిచ్చారు.