- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ కోసం ఆస్తులు అమ్మేస్తా.. ఈటల సంచలన వ్యాఖ్యలు
దిశ, కమలాపూర్: నా ప్రాణాన్ని పణంగా పెట్టి, ఆస్తులు మొత్తం అమ్మి అయినా కేసీఆర్ దుర్మార్గం, దౌర్జన్యాలపై పోరాడుతానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మంగళవారం పద్మశాలి కులస్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ..18 సంవత్సరాలు పార్టీని, పార్టీ జెండాను తెలంగాణ వ్యాప్తంగా విస్తరించానని, కేసీఆర్ నాకు ఏ బాధ్యత అప్పజెప్పినా మచ్చ లేకుండా పని చేసానని గుర్తు చేశారు. అటువంటి తనపై అక్రమ ఆరోపణలు చేసి బయటికి వెళ్లగొట్టారని ఆరోపించారు. ఈటల ఒక్కని పై ఇన్ని వందల కోట్లు ఖర్చు చేసి, ఇన్ని వేల కోట్ల హామీలిచ్చారని, ఎవరు ఏది అడిగితే అది ఇస్తున్నారని, అక్రమంగా సంపాదించిన వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్‌కు ఓటు వేయకపోతే పెన్షన్లు, దళిత బంధు, సొసైటీ పాలకవర్గాలను ఖతం చేస్తామని ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలను భయపెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అహంకారాన్ని బొంద పెట్టకపోతే రేపు రాష్ట్రానికి అరిష్టం రాబోతుందన్నారు.