- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్లాష్.. ప్లాష్.. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్..
దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో ఈటల బీజేపీలో చేరారు. మంత్రి ఈటలకు పార్టీ సభ్యత్వం ఇచ్చి, కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానం పలికారు. ఈటలతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, రమేష్ రాథోడ్, తుల ఉమ, అశ్వద్ధామ రెడ్డి, ఓయూ జేఏసీ నేతలను ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అన్ని జిల్లాల నుంచి బీజేపీలోకి చేరికలు ఉంటాయని అన్నారు. తెలంగాణలో బీజేపీని మరింత విస్తరించడంలో నా శ్రమ ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర బీజేపీ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించారు. తెలంగాణలోని ప్రతీ నియోజకవర్గంలో బీజేపీలోకి చేరికలు ఉంటాయని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పార్టీలో చేరినందుకు రాష్ట్ర బీజేపీ పార్టీ నాయకత్వం తరఫున ఈటలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. నియంత పాలన(గడీల పాలన)లో నుంచి ఈటల రాజేందర్ బయటకు వచ్చారని అన్నారు. ఇక ప్రభుత్వంపై పోరుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం బీజేపీ కృషి చేస్తుందని పేర్కొన్నారు.