- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజలు నావైపే ఉన్నారు: ఈటల
దిశ, డైనమిక్ బ్యూరో: హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజలకు-సీఎం కేసీఆర్‌కు మధ్య జరిగే యుద్ధమంటూ.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి మరోసారి విజయాన్ని సాధించిన అనంతరం ఈటల రాజేందర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ గెలుపు కోసం కష్టాలకు ఓర్చి కృషి చేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల వేళ అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం పేరుతో టీఆర్ఎస్ నేతలు అక్రమాలు చేసినా.. ఆ అక్రమాలను స్వేచ్ఛగా చూపించలేని పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. ఇది చాలనట్టు కుల ఆయుధాన్ని ప్రయోగించారన్నారు. రకరకాల పథకాలతో ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేసినా.. ఓటర్లు మాత్రం బీజేపీనే గెలిపించారన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన ఎన్నికల సంఘం అధికారులు ప్రజాస్వామ్య విలువలను పాటించలేదని ఆరోపించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ పోలీసులు దగ్గరుండి డబ్బులు పంపిణీ చేయించారని మండిపడ్డారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజలు మాత్రం గొప్ప మెజార్టీతో తనను గెలిపించారని ఈటల గుర్తు చేశారు.