కేసీఆర్ నాకు నరకం చూపించారు.. ఈటల సంచలన వ్యాఖ్యలు

by Anukaran |   ( Updated:2021-11-12 10:11:44.0  )
కేసీఆర్ నాకు నరకం చూపించారు.. ఈటల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ హుజురాబాద్​ ఉప ఎన్నికల కోసం ప్రపంచంలోనే అత్యధికంగా డబ్బు ఖర్చుచేశారని, ఓటర్లకు పైసలిచ్చి కులదేవతలు, పసుపు, కుంకుమ మీద ప్రమాణం చేయించి నాకు నరకం చూపించారని హుజురాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​అన్నారు. శామీర్​పేటలోని ఆయన నివాసంలో హుజురాబాద్​ నియోజకవర్గానికి చెందిన పలు కులసంఘాల ప్రతినిధులు శుక్రవారం ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. హుజురాబాద్ ​ఉప ఎన్నికలో ఎలా డబ్బు ప్రవాహం సాగిందో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని కేసీఆర్ ​చూస్తున్నారని ఆరోపించారు. దీన్ని చూసి సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఒకనాడు రాజకీయాలు సర్వీస్ కోణంలో ఉండేవని, కానీ కేసీఆర్ రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేశారన్నారు. అస్తిత్వం, త్యాగశీలత, ఆత్మగౌరవానికి మారుపేరుగా ఉన్న రాష్ట్ర రాజకీయాన్ని డబ్బులమయం చేశారని విమర్శించారు. గొంతెత్తిన ప్రతి ఒక్కరినీ ఖతం చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. హుజురాబాద్ ​బైపోల్‌లో ప్రజలంతా ధర్మానికి అండగా నిలిచారన్నారు.

కేసీఆర్​ప్రభుత్వం కొనసాగటం సమాజానికి అరిష్టమని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇకనైనా అలసత్వం వహించకుండా సీరియస్‌గా స్పందించాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. తోక మీద కొట్టి వదిలిపెట్టొద్దని, అసలు యుద్ధం ఇప్పుడే మొదలైందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే తనకు చాలా మంది ఫోన్లు చేసి ఇదే విషయాన్ని చెబుతున్నారన్నారు. కేసీఆరే తనను ప్రజలకు ఆయుధంగా అందించారని చెబుతున్నారని వివరించారు.

నెక్ట్స్ సీఎంగా రేవంత్ రెడ్డే.. ఆ సర్వేలో ప్రజల ఓటు ఆయనకే!

మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి మంచిదా, కాదా ?

Advertisement

Next Story