బిగ్ న్యూస్ : ఈటల ఆస్తుల చిట్టా ఇదుగో..

by Sridhar Babu |
బిగ్ న్యూస్ : ఈటల ఆస్తుల చిట్టా ఇదుగో..
X

దిశ, కరీంనగర్ సిటీ : హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబ ఆస్తుల వివరాలను శుక్రవారం వెల్లడించారు. ఈటల దంపతులకు రూ. 54 కోట్ల పై చిలుకు ఆస్తులున్నట్లు ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపారు. తన పేర రూ.12,56,20,097 విలువ గల స్థిర, చరాస్థులున్నట్టు, ఇందులో రూ.7.5 కోట్ల విలువ గల నివాస గృహాలు, రూ.2.5 కోట్ల వాణిజ్య భవనం, రూ.2.5 కోట్ల వ్యవసాయ భూమి ఉన్నట్లు పేర్కొన్నారు.

వీటితో పాటు రూ.3,62,42,168 అప్పులున్నట్లు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 19 కేసులు నమోదు కాగా, ఇప్పటికీీ 5 కేసుల విచారణ పెండింగులో ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే భార్య ఈటల జమున పేర రూ. 43,47,05,894 విలువ గల చర, స్థిరాస్తులున్నట్లు వెల్లడించారు. ఇందులో రూ.3 కోట్ల విలువ చేసే వాణిజ్య భవనాలు, రూ.2 కోట్ల విలువ చేసే వ్యవసాయేతర భూమి, రూ. 9,78,84,000 విలువ గల వ్యవసాయ భూమి ఉందని, అలాగే రూ.4,89,77,978ల అప్పులు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed