- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఈటల.. భారీగా ర్యాలీ
దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు అనంతరం తొలిసారి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఈటల రాజేందర్ శనివారం రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవ విజయోత్సవ ర్యాలీ పేరిట శామీర్ పేట నుంచి ఆయన నాంపల్లిలోని బీజేపీ పార్టీ కార్యాలయానికి రానున్నారు. ఈ ర్యాలీ మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమై తుమ్మికుంట, అల్వాల్, ప్యారడైజ్, రాణిగంజ్, గన్‌పార్క్ మీదుగా బీజేపీ పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు.
కాగా అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళులర్పించనున్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటలను సన్మానించనున్నారు. ఇదిలా ఉండగా శనివారం ఆయన ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి రావాలని తొలుత భావించినా.. అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దయినట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. గెలుపు అనంతరం బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వస్తున్న ఈటల ఏ అంశాలపై మాట్లాడుతారోననే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణ ప్రభుత్వంపై ఎలాంటి కీలక ప్రకటన చేస్తారోననే ఆసక్తి అందరిలో నెలకొంది.