HYD: అర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు.. ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shyam |
CJI-NV-Ramana
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు శుక్రవారం ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ పూర్తైంది. ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, జడ్జీలు ఎల్.నాగేశ్వరరావు, ఆర్. సుభాష్ రెడ్డి, హైకోర్టు సీజే హిమా కోహ్లీ, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డిలు పాల్గొన్నారు. కాగా, ఇదివరకు మల్టీనేషనల్ కంపెనీలు ఆర్బిట్రేషన్ కోసం సింగపూర్, దుబాయ్ దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుతో హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుతో వివాదాలు త్వరగా పరిష్కారం అవుతాయని అన్నారు.

దివంగత ప్రధాని పీవీ హయాంలో ఆర్థిక సంస్కరణలు జరిగాయని తెలిపారు. పెట్టుబడులు పెట్టేవారు.. లిటిగేషన్లతో ఇబ్బందులు పడుతుంటారని, అలాంటి వారికి దీంతో ఉపశమనం కలుగుతుందని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. వివాదాల పరిష్కరానికి కంపెనీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఎన్వీ రమణ తెలిపారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు.. సీజేఐ మానసపుత్రిక అని కేటీఆర్ తెలిపారు.

Advertisement

Next Story