- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాలీవుడ్ ఎంట్రీ అడ్డుకున్నాడు.. హేమమాలిని కూతురు ఆసక్తికర కామెంట్స్
దిశ, సినిమా : బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ హీరో ధర్మేంద్ర, హేమమాలిని కూతురు ఇషా డియోల్ ప్రొడ్యూసర్‌గా మారింది. గతంలో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఇషా.. ‘ఏక్ దువా’ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. భరత్ ఇషా ఫిలిమ్స్‌పై తనే నటిస్తూ నిర్మించిన చిత్రం ప్రస్తుతం ‘వూట్’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవుతోంది.
తల్లీ కూతురి ఎమోషనల్ స్టోరీ జెండర్ డిస్క్రిమినేషన్‌పై ఫోకస్ చేసిన నేపథ్యంలో.. రీసెంట్ ఇంటర్వ్యూలో భాగంగా తనతో పాటు సిస్టర్ అహనా డియోల్ ఎప్పుడైనా అలాంటి వివక్షను ఎదుర్కొన్నారా? అనే ప్రశ్న ఎదురైంది. ఈ మేరకు తనది బలమైన వ్యక్తిత్వంగా పేర్కొన్న ఇషా.. ఏం చేయాలనుకుంటున్నానో, ఏం చేయకూడదో తనకు క్లారిటీ ఉంది కనుక పెద్దగా ప్రభావం చూపలేదని వివరించింది.
అయితే ఫాదర్ ధర్మేంద్ర పొసెసివ్‌నెస్ కారణంగా సినిమాల్లో నటించేందుకు అభ్యంతరం వ్యక్తం చేశారని వెల్లడించింది. ఇండస్ట్రీ కల్చర్ ఆయనకు బాగా తెలుసు గనుక తాము సినిమా ప్రపంచానికి దూరంగా సురక్షిత ప్రదేశంలో ఉండాలనుకునేవారని చెప్పింది. దీంతో ఆయన అయిష్టంగానే ఒప్పుకున్నా.. ఆ తర్వాత తాము పర్ఫెక్ట్‌గా మ్యానేజ్ చేసుకోవడంతో ఎలాంటి సమస్య తలెత్తలేదని తెలిపింది.