డీఎస్ రెడ్డి రైస్ మిల్లును ప్రారంభించిన ఎర్రబెల్లి సతీమణి

by Shyam |
డీఎస్ రెడ్డి రైస్ మిల్లును ప్రారంభించిన ఎర్రబెల్లి సతీమణి
X

దిశ, దేవరుప్పుల: దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామంలో జే.ఎం.జే గ్రూప్ ఆధ్వర్యంలో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన డీఎస్ రెడ్డి రైస్ మిల్లును ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్ ‌పర్సన్ ఉషాదయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు ఉపయోగపడే విధంగా ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన రైస్ మిల్‌ను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఉషాదయాకర్ రావును రైస్ మిల్ యజమాని దుగ్గింపుటీ కిరణ్ రెడ్డి దంపతులు ఘనంగా సన్మానించారు. అనంతరం మండలంలోని పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆమె ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేష్, జడ్పీటీసీ పల్లా భార్గవి సుందర్ రాంరెడ్డి, గ్రామ సర్పంచ్ పోతిరెడ్డి బ్లేతినా లీనారెడ్డి, రైతుబంధు మండలాధ్యక్షులు ఈదునూరి నర్సింహారెడ్డి, కోతి ప్రవీణ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చింత రవి, పీఏసీఎస్ డైరెక్టర్ కొత్త జలంధర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు బానోత్ నవీన్, సర్పంచ్‌లు బానోత్ రాజన్న, శంకర్, శ్రీనివాస్, ఎంపీటీసీ దుబ్బాక కవిత రత్నాకర్ రెడ్డి,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story