- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎర్రబెల్లి
దిశ, వరంగల్: కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించినందున ఈ ఆపత్కాలంలో అందరం కలిసికట్టుగా నడవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని పలు గ్రామాల్లో నిరుపేదలకు ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో మంత్రి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఓ వైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు కరోనా సమస్య నెలకొందన్నారు. అయినా, సీఎం కేసీఆర్ మాత్రం ప్రజల ప్రాణాలే ముఖ్యమంటున్నారని చెప్పారు. ఓ పూట పస్తులుండైనా సరే ప్రజల ప్రాణాలను కాపాడాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని కొనియాడారు. ఇలాంటి సమయంలోనే మనమంతా ఏకతాటిపైకొచ్చి లాక్‌డౌన్‌ని పకడ్బందీగా పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.
Tags: Errabelli trust, Dayakar Rao, supplies, essential goods, warangal