- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలా అయితే.. ఆనందంగా జీవించగలం: ఎర్రబెల్లి
దిశ, వరంగల్: ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ కు సంబంధించి ప్రజలకు మంత్రి పలు సూచనలు చేశారు.. ఆయన చెప్పిన విధంగా పాటిస్తే ఆనందంగా జీవించగలమని పేర్కొన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు మండలం జమస్థాన్ పూర్ లో పలువురు దాతల సహకారంతో అందిస్తున్న నిత్యావసర వస్తువులను నిరుపేదలకు పంపిణీ చేసిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన.. అమ్మాపురం గ్రామంలో మహారాష్ట్రకు చెందిన వలస కూలీలను పరామర్శించారు. కరోనా సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ వల్ల కరోనా వైరస్ కూడా కట్టడిలోనే ఉందన్నారు. అయితే, ప్రజలు మరింత కట్టుదిట్టంగా కరోనా కట్టడికి ప్రయత్నించాలని, లాక్ డౌన్ ను కఠినంగా పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా నడుచుకోవడం వల్ల మనం మరింత ఆరోగ్యంగా, ఆనందంగా జీవించలగమని మంత్రి పిలుపునిచ్చారు. అలాగే కరోనా కట్టడి అయ్యే వరకు నిరుపేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పేదలను ఆదుకుంటున్న దాతలను మంత్రి అభినందించారు.