- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కడియం శ్రీహరిపై ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు.. రాజకీయ వర్గాల్లో చర్చ
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ అర్బన్ కలెక్టరేట్ కాంప్లెక్స్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రోటోకాల్ ప్రకారం.. నేతలంతా స్టేజ్‌పై కూర్చున్నారు. కడియం శ్రీహరి స్టేజ్ కింద ఉన్న కూర్చీల్లో కూర్చునేందుకు వెళ్తుండగా ఎర్రబెల్లి.. పర్లేదు మీరు పైన కూర్చోండి.. పదవీ కాలం పూర్తైనా పర్వాలేదంటూ నొక్కి చెప్పారు.
కడియం శ్రీహరి వారించినా.. ఎర్రబెల్లి దయాకరరావు మాత్రం ఆయన పైకి రావాలని కోరారు. కడియం శ్రీహరి ఇంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ భోజనానికి వెళ్తుండగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి రెన్యూవల్ ఖాయమన్నా చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుండగా ఎర్రబెల్లి దయాకరరావు నర్మగర్భ వ్యాఖ్యలు ఆసక్తి కల్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో కడియం శ్రీహరితో ముచ్చటిస్తూ కనిపించడం గమనార్హం. కడియం శ్రీహరికి ఎమ్మెల్సీ పదవి ఖాయమన్న చర్చ జోరుగా సాగుతోంది.